Posted on

Telugu tips for cervical spondylosis – మెడ నొప్పి సమస్యకు చిట్కాలు

పెరుగుతున్న వయసుతో పాటుగా మనకి ఎన్నోరకాల శారీరక సమస్యలు తలెత్తడం ప్రారంభమవుతాయి. మెడ నొప్పి అనేది కూడా వాటిలో ఒక ప్రధానమైన సమస్య. మన శరీరం సమస్యలకు లోనవుతూ ఉన్న క్రమంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అనగా ఈ సమస్య అరవై ఐదు సంవత్సరాలకు పైబడిన వారిలో ఇతర శారీరక సంస్థలతో పాటుగా చాలా సాధారణంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ సమస్య గొంతు సంబంధిత వెన్నుముక లేదా మెడ స్నాయువులు మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. పెరుగుతున్న వయస్సు క్రమంలో క్షీణించిన డిస్కులను మన శరీరంలో గుర్తిస్తూ ఉంటాము. ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ (మెడ నొప్పి)సమస్యలో సాధారణంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని కేసుల్లో నొప్పికి బదులుగా ఇతర సంకేతాలు కనిపించవచ్చు.

ఈ మెడ నొప్పి వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటి?

వయసు మళ్ళుతున్న కొద్దీ మీ శరీరంలోని ఎముకలు మరియు మృదులాస్థికలు వెనుక మీద లేదా మెడ మీద ఎక్కువగా ఆధారపడటం ప్రారంభిస్తాయి. అలా దాని సామర్ధ్యం క్షీణించడం జరుగుతుంది. దాని ఫలితమే ఈ సమస్య.

హెర్నియేటెడ్ మరియు డీ హైడ్రేటెడ్ డిస్కులు

మనం 40 ఏళ్ళకు చేరుకున్నాక ఈ డిస్కులు పొడిబారి కుంచుకు పోవడం ప్రారంభమవుతాయి. డిస్కుల మీద పగుళ్ళు కూడా ఏర్పడతాయి. ఇది డిస్కులు ఉబ్బిపోవడానికి కారణం అవుతాయి.

ఫ్లెక్సిబులిటీ లేనటువంటి స్నాయువులు (లింగామెంట్స్)

వెన్నుపూస స్నాయువులు కదలికలు లేకుండా ధృడంగా మారవచ్చు. అందువల్ల మెడ కూడా తన ఫ్లెక్సిబులిటీ కోల్పోతుంది. ఈ సంధర్బంలో మెడ కదల్చలేని విధంగా నొప్పితో బాధించవచ్చు.

ఎముకుల తుల్లిపాటు

డిస్కుల యొక్క క్షీణత వలన శరీరంలోని ఎముకలన్నీ వెన్నుముకని బలంగా చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తాయి. అయితే ఇది నరాల యొక్క మూలాలను దెబ్బ తీయవచ్చు.

మెడ నొప్పి సమస్యకు కారకాలు

వృత్తి

కొంతమంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలలో వాళ్ళ మెడను స్థిరంగా ఉంచడమో లేదా వాళ్ళ మెడ అధికమైన ఒత్తిడి పొందడమో జరుగుతుంది. అటువంటి వాళ్ళకి ఈ విధమైన మెడ నొప్పులు సంభవించే అవకాశం హెచ్చుగా ఉంటుంది. అంతే కాకుండా నృత్యకారులకు మరియు మార్షల్ ఆర్ట్స్ చేయు వ్యక్తులకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశముంది.

జన్యు కారణాలు

పరిశోధకులు జన్యుకారణాలు కూడా ఈ విధమైన సమస్యలకు కారణం కావచ్చని కనుగొన్నారు. అందువల్ల మీరు మీ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకున్ని మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

ధూమ పానం

ధూమపానం అలవాటు ఉన్న వారిలో కూడా ఈ మెడ నొప్పి సమస్యలు తలెత్తవచ్చు. ఇది వరకు చెప్పుకున్నట్లు వయస్సు పెరుగే కొద్దీ అన్ని సమస్యలతో పాటుగా మెడ నొప్పి సమస్య కూడా ఏర్పడవచ్చు. మెడ నొప్పి సమస్యకు ఇది కూడా ముఖ్యమైన కారకంగా ఉన్నది.

మహిళలు మరియు పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే మహిళలతో పోల్చి చుస్తే పురుషులలో ఈ సమస్య అతి పిన్న వయస్సు నుండే ప్రారంభం అవ్వడం నేడు గమనిస్తూ ఉన్నాం.

కొన్ని సందర్బాలలో నరాల ఒత్తిడి శాశ్వతమైన నష్టాలకు కూడా దారితీయవచ్చు. మీకు మెడ నొప్పి ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా మీ ఫిజీషియన్ ను సంప్రదించడం అన్ని వేళలలోను మంచిది.

సర్వికల్ స్పాండిలోసిస్ ను సూచించే సంకేతాలు

  • భుజాలు పట్టేయడం అప్పుడప్పుడు మెడ నొప్పి రావడం.
  • తలనొప్పి – ఇది మీ మెడకి వెనుక భాగంలో ప్రారంభమవుతుంది.

మీరు మీ ఫిజీషియన్ ను సంప్రదించినప్పుడు అతను మీకు కొన్ని పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణకు వస్తారు.

శారీరక పరీక్ష

డాక్టరు మీ మెడని ప్రక్కలకు త్రిప్పి దాని కదలికలను అంచనా వేస్తారు. అంతేకాకుండా మీ పాదాలు మరియు చేతుల ప్రతిచర్యలను కూడా పరీక్ష చేస్తారు. మిమ్మల్ని నడవమని చెప్పి మీ నడక స్థితిని, శరీర భంగిమలని పరిశీలిస్తారు. శరీరంలోని ఎగువ మరియు దిగువ అవయముల బలము, బలహీనతలను చూసి ఒక అంచనాకు వస్తారు.

చిత్రాల కోసం స్నానింగ్ ప్రక్రియ

మీరు మీ వెన్నుముక పనిచేయు పరిస్థితిని తెలుస్కోవడానికి ఎక్స్-రే తీయించుకోవాల్సి ఉంటుంది. మీకు భుజముల నొప్పి మరింత తీవ్రమైన స్థితిలో ఉన్నట్లయితే మీ ఫిజీషియన్ MRI స్కానింగ్ చేయించుకోవాలని సిఫార్సు చేయవచ్చు.

ఈ సమస్యకి సంబంధించిన మరొక పరీక్ష మైలోగ్రామ్. నిపుణులు మీ వెన్నుముకలో ఒక డై ను అమర్చడం ద్వార అది అది స్కానింగ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే CT స్కానింగ్ కూడా మరింత ప్రభావవంతంగా మీ ఎనుముకుల నిర్మాణాన్ని పరిశీలించడానికి సమర్ధవంతంగా ఉంటుంది. ఇకపోతే ఎలెక్ట్రోమయోగ్రఫి మరియు NCS లు అనునవి నరాలను మరియు కండరాలను పరిశీలంచడానికి సహాయకరులుగా ఉంటాయి.

చికిత్స

ఆధునిక చికిత్సలు వ్యాధి లక్షణాలను తగ్గుముఖం పట్టించడంలో మంచి ఫలితాలను అందిస్తున్నాయి.

చాల ఎక్కువ మంది ఫిజీషియన్లు కండరాలకు విశ్రాంతి కల్పించే ప్రక్రియలలో భాగంగా బిగుసుకుపోయిన కండరాలు మరియు మెడ స్థంబించడం వంటి సమస్యలకు ఉపయోగించే సాధారణ రిలాక్సేషన్ ప్రక్రియ సైక్లోబెంజప్రైన్.

  • భాదను తగ్గించడానికి ఉపయోగించే మెడిసన్ అమిట్రిప్టిలిన్. ఇది భాధ తీవ్రతని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • ఫిజీషియన్లు నొప్పి తగ్గడానికి స్టెరాయిడ్ ను మీ మెడకు ఇంజెక్ట్ చేయవచ్చుకూడా. 

శస్త్ర చికిత్స ప్రక్రియ

ఆస్టియోఫైట్లు మరియు ఉబికిన ఎముకులను తొలగించి నరాల మూలాలలో ఒత్తిడి తగ్గించడం ద్వారా శస్త్ర చికిత్సకులు మిమ్మల్ని బాధనుండి ఉపశమనం కల్పిస్తారు.

వ్యాయామాలు

మీ ఫిజీషియన్ చెప్పే సులభ వ్యాయామాలను చేయడం ద్వార కొంత వరకు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మెడ నొప్పికి ఇంటి చిట్కాలు

వెల్లుల్లి

వెల్లుల్లి వినియోగం మెడ నొప్పి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నప్పుడు గొప్ప పరిష్కరినిగా ఉంటుంది. వెల్లుల్లి మెడ బాగంలో వాపు, నొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది.

పసుపు

పసుపు యొక్క ధర్మాలు మీ మెడ నొప్పి సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. ఇది మెడ నొప్పి కారణంగా వచ్చే నొప్పిని మరియు కండరాల స్తంభనను తగ్గిస్తుంది.ఒక గ్లాసు నిండా పలు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. తక్కువ మంటలో 5 నిముషాలపాటు వేడి చేసి దించేయండి. చల్లారిన తర్వాత ఒక టే స్పూన్ తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు త్రాగండి.

నువ్వులు

మీకు ఆయుర్వేదం యొక్క నమ్మశక్యం కానీ సమర్ధత మీద నమ్మకం ఉన్నట్లయితే అది మీకు నయం చేయడానికి ఎప్పటికీ సిద్దమే. నువ్వులు సహజ సిద్దమైన ఎన్నో అద్భుత లక్షణాలను కలిగి ఉన్నాయి. నువ్వుల నూనెతో రోజుకి కొన్ని సార్లు మర్దనా చేసుకోవడం వలన ఫలితాలని మీరే చూస్తారు.