Posted on

Telugu remedies for yellow teeth – పసుపు దంతాల చికిత్స కోసం ఇంటి చిట్కాలు

శరీరంలో దంతాలు ఒక ముఖ్యమైన భాగం. ఇవి తెల్లగా ఉంటే మనం మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు మన ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా కనపడుతుంది. పసుపు రంగు పళ్ళు చాలా వికారంగా ఉంటుంది మరియు తోటి వారికి మన పై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

పళ్ళను సరిగ్గా బ్రష్ చేయకపోవటం, వయసు అవటం, వంశానుగత కారణాలు, సరైన దంత పరిశుభ్రత లేఖ పోవటం, టీ మరియు కాఫీ ఎక్కువగా త్రాగటం, పొగాకు మరియు సిగరెట్ అధికంగా వినియోగించటం వలన మీ పళ్ళు పసుపు రంగు కావచ్చు. చాలా మంది దంతాల యొక్క తెలుపు రంగును తిరిగి పొందేందుకు ఎన్నో ఖరీదైన చికిత్సలను చేస్తారు. కానీ ఇంటిలోని పదార్థాలను ఉపయోగించి ఈ పసుపు రంగుని సులభంగా తొలగించవచ్చు.

పళ్ళపై పసుపు మరకలు తొలగించేందుకు ఇంటి నివారణలు

బేకింగ్ సోడా

బేకింగ్ పొడిని ఉపయోగించి పళ్ళ రంగును తెల్లగా మార్చే ఒక మౌత్ వాష్‌ని తయారు చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని 1/2 కప్పు చల్లని నీటిలో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు మౌత్ వాష్‌లా ఉపయోగించండి.

స్ట్రాబెర్రీలు

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించేందుకు తోడ్పడుతుంది.3 స్ట్రాబెర్రీలను బాగా రుబ్బి మీ పళ్ళపై ఒక నిమిషం పాటు రుద్దండి. ఇలా వారానికి 3 సార్లు ఉపయోగించండి.

నిమ్మరసం

కొన్ని చుక్కల నిమ్మరసంలో ఒక చిటికె ఉప్పుని కలుపుకొని మీ పళ్ళపై రుద్దండి. లేదా నిమ్మపండు యొక్క తొక్కని పళ్ళపై రుద్ది నీటితో నోరు పుక్కిలించండి. నిమ్మపండులో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నందున మంచి ఫలితాలను ఇస్తుంది.

ఆపిల్ పండు

మీరు ఆపిల్ పండును తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఎందుకంటే ఇందులోని అసిడిక్ లక్షణాలు మరియు ఇందులోని ఫైబర్ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించేందుకు తోడ్పడుతుంది. మీ రోజూ డైట్లో ఆపిల్ పండును చేర్చుకొండి. ఇది మీ పళ్ళకు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉప్పు

ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ నోటిలో ఉన్న బాక్టీరియాలను తొలగించి పళ్ళను తెల్లగా చేస్తుంది. అంతే కాదు మీ పళ్ళకు కావలసిన మినరల్స్ ని కూడా అందిస్తుంది. ఉప్పుని వాడేటప్పుడు జాగ్రత్తను వహించాలి, వీటిని ఎక్కువ కఠినంగా పళ్ళపై వాడటం వలన మీ చిగురు మరియు ఎనామెల్ని బాధించవచ్చు.

చార్కోల్

మీరు రోజూ ఉపయోగించే టూత్పేస్ట్ పై కొద్దిగా చార్కోల్ పౌడర్ చేర్చుకొని మృదువుగా బ్రష్ చేయండి. మీ పళ్ళు తెల్లగా అయ్యే వరకు రోజుకు రెండు సార్లు చార్కోల్ తో బ్రష్ చేయండి.

నారింజ తొక్క

రాత్రి పడుకునే ముందు నారింజ తొక్కతో మీ పళ్ళను బాగా రుద్దండి. దీనిని కడగకుండా రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీటితో కడగండి. ఇది మీ పళ్ళకు తెలుపు రంగు ఇవ్వటమే కాదు క్రిములతో పోరాడి మీ దంతాలను ధృఢంగా చేస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఇందులోని బ్లీచింగ్ ఏజెంట్స్ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగిస్తుంది. మీరు మౌత్ వాష్ కొనేటప్పుడు అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండేలా చూసి కొనండి.

తులసి

మన భారత దేశంలో ప్రతి ఇంటిలోనూ తులసి చెట్టును పూజిస్తాము. ఇందులో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఇది మన పళ్ళ పసుపు రంగును మరియు అనేక నోటి సమస్యలను తొలగించేందుకు ఉపయోగ పడుతుంది. కొన్ని తులసి ఆకులను కొన్ని గంటలు ఎండలో ఉంచండి. ఆకులు బాగా ఎండిన తరువాత రుబ్బి పొడిలా చేసుకోండి. ఈ పొడిని మీ టూత్ పేస్ట్ తో పాటు పళ్ళను బ్రష్ చేసేటప్పుడు ఉపయోగించండి. లేదా, ఈ పొడిని ఆవాల నూనెలో కలుపుకొని పళ్ళపై మర్దన చేయండి.

వేపాకు

మన పురాతన రోజులలో పళ్ళను బ్రష్ చేసేందుకు వేపాకు చెట్టు యొక్క కొమ్మలను ఉపయోగించే వారు. ఇందులోని యాంటీ సెప్టిక్ మరియు క్రిమినాశక లక్షణాలు పళ్ళను తెల్లగా చేస్తుంది. మరియు చెడు వాసనను తొలగిస్తుంది. మీ పెరటిలో ఈ చెట్టు ఉన్నట్లయితే వీటి యొక్క కొమ్మలను ఉపయోగించి మీ పళ్ళను రోజూ రుద్దండి. ఇది చేదుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తుంది.

అరటి పండు తోలు

అరటి పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. కానీ అరటి తొక్క వలన కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇది పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించి తెల్లగా చేస్తుంది. అరటి తోలును పళ్ళపై 2-3 నిమిషాలు రుద్ది 15 నిమిషాల తరువాత సాధారణ టూత్ పేస్ట్ తో బ్రష్ చేయండి. ఇలా వారానికి 2 లేదా 3 రోజులు చేయండి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షను ఎన్నో రకాల తీపి వంటకాలలో వాడుతాము. వీటిలో కొన్ని మీ దంతాలపై పసుపు మరకలను తొలగించేందుకు ఉపయోగించండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని ఎండుద్రాక్షలను నోటిలో వేసుకొని నమలండి. ఇది మీ నోటి లోపల లాలాజలమును అధికంగా ఉత్పత్తి చేసి పసుపు రంగును తొలగిస్తుంది.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. ఇది మీ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. నారింజ, నిమ్మ, పైనాపిల్  లాంటి పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక సిట్రస్ పండులోని చిన్న ముక్కను తీసుకొని మీ పళ్ళపై రుద్దండి.

ఆయిల్ పుల్లింగ్

ఈ పద్దతిని మన అమ్మమ్మ మరియు తాత చెప్పి ఉంటారు. కానీ మనలో కొందరు నిర్లక్ష్యం చేసి ఉంటాము. ఆయిల్ పుల్లింగ్ మీ పళ్ళను తెల్లగా చేయటం మాత్రమే కాదు మీ నోటిలోని బాక్టీరియాలను కూడా తొలగిస్తుంది.

పాలు మరియు పెరుగు

పళ్ళకు ముఖ్యమైన పోషకాలు కాల్షియం మరియు ఫాస్పరస్. పాలు మరియు పెరుగు మీ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించి పంటి ఎనామెల్ యొక్క ఖనిజాలను తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. కావిటీస్ ను కూడా తొలగిస్తుంది.

మర్రి చెట్టు మూలాలు

మీ పంటి సమస్యలను తొలగించేందుకు మర్రి చెట్టు యొక్క మూలాలను కూడా ఉపయోగించవచ్చు. మీరు టూత్ బ్రష్ లాగా వీటి వేర్లను ఉపయోగించవచ్చు. ఇది మీ పళ్ళపై పసుపు రంగును తొలగించి తెల్లగా చేస్తుంది.

పచ్చికూరలు

కీరదోస వంటి పచ్చికూరగాలయను బాగా నమిలి తినడం వలన పసుపు రంగు దంతాలు తెల్లగా మారుతాయి .

ఆపిల్ సీడర్ వెనిగర్

ఆపిల్ సీడర్ వెనిగర్ తో మీ పసుపు రంగు పళ్ళను తెల్లగా మార్చుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు ఆపిల్ సీడర్ వెనిగర్ తో నోరు పుక్కిలించి కడగండి. ఇది నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.

క్యారట్

పళ్ళపై పసుపు రంగును తొలగించేందుకు క్యారట్ లోని ఫైబర్ సహాయపడుతుంది. అంతే కాదు ఇది దంతాలను దృఢంగా చేస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క, కొద్దిగా ఉప్పు నమిలి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించాలి. లేదా దాల్చిన చెక్క పొడితో బ్రష్ చేయండి.